![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్- 428 లో.. శ్రీనివాస్ దగ్గరికి ముకుంద కోపంగా వస్తుంది. వచ్చేసేవా? మురారిని విడిపించేశావా? తప్పు చేశావ్ ముకుంద అని శ్రీనివాస్ కోపంగా అనగానే.. తప్పు చేసింది నువ్వు నాన్న అని ముకుంద అంటుంది. అసలు నీకు మానవత్వం ఉందా? మురారిని అంత దారుణంగా కొట్టిస్తావా అని ముకుంద అనగానే.. ఈ ఒక్క రాత్రి నువ్వు కళ్ళు మూసుకుంటే తెల్లారేసరికి మురారి కళ్ళుమూసేవాడని శ్రీనివాస్ అంటాడు. ఆపు నాన్న .. ఇంకొక మాట మాట్లాడితే కన్నతండ్రివి అని కూడా చూడనని ముకుంద అనగానే.. నేను నీ కన్నతండ్రినే అమ్మ, నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసినవాడిని నేనెలా వదిలేస్తానని శ్రీనివాస్ అనగానే.. నేను చెప్పానా అని ముకుంద అంటుంది.
ఒకరు చెప్పడమేంటమ్మ మురారీనే నీ జీవితాన్ని నాశనం చేశాడని నీ కథ తెలిసిన ప్రతీ ఒక్కరు చెప్తారని శ్రీనివాస్ అంటాడు. లేదు నాన్న మురారి క్లియర్ గానే ఉన్నాడు. కానీ నేనే మొదటి నుండి మురారీయే నా జీవితం అనుకొని ఉన్నానని ముకుంద అంటుంది. ఇక కాసేపు వాళ్ల నాన్న శ్రీనివాస్ ను తిట్టి ఇల్లు అమ్మేసి ఎక్కడికైనా వెళ్ళిపోమని ముకుంద చెప్తుంది. నేను నా మురారిని దక్కించుకున్నాక నేనే వచ్చి నిన్ను కలుస్తానని, మురారి ఇంట్లో వాళ్ళకి నువ్వు దొరికితే నిన్ను చంపేస్తారు. కానీ ఆడపిల్ల చనిపోయిందనే జాలితో ఆగుతున్నారు. అది పోయేలోపే ఇల్లు అమ్మేసి ఎక్కడికైనా వెళ్లిపోండి అని శ్రీనివాస్ తో ముకుంద అంటుంది. మరోవైపు మురారికి కాపలాగా కృష్ణ రాత్రంతా నిద్ర పోకుండా ఉంటుంది. నా వల్లే కదా గత రెండు రోజులుగా నిద్రలేకుండా ఉన్నావని కృష్ణతో మురారి అంటాడు. మీరు రారేమోనని భయంతో వణికిపోయాను. మిమ్మల్ని కాపాడుకోవడానికి ఏ దారి దొరకలేదు. అప్పుడే మీరొచ్చారు. కలా నిజామా అన్నట్టుగా ఉంది. కళ్ళుమూస్తే ఎక్కడ అది కలైపోతుందోనని రాత్రంతా పడుకోకుండా మిమ్మల్నే చూస్తూ ఉన్నానని కృష్ణ చెఒ్తు. దాంతో మురారి కన్నీరుపెట్డుకుంటాడు. అది చూసిన కృష్ణ కన్నీరు తూడుస్తూ.. ఏసీపీ సర్ ఏంటిది చిన్నపిల్లాడిలా, మీరు వచ్చేసారు కదా, మనకి ఏ సమస్య ఉండదని కృష్ణ అంటుంది. ఏ నిమిషం నువ్వు నా జీవితంలోకి వచ్చావో అప్పటి నుండి దుఃఖం, బాధ, కన్నీళ్ళు తప్ప నీకేం మిగిలిందని మురారి అనగానే.. అయ్యో ఏసీపీ సర్ ఇష్టమైన వారి కోసం కన్నీరు కార్చడంలో ఉన్న సంతోషం ఇంకెక్కడ ఉంటుందని కృష్ణ అంటుంది. ఆ తర్వాత రేవతి వచ్చి కృష్ణ, మురారీలతో మాట్లాడుతుంది.
మరోవైపు అదర్శ్ బ్యాగ్ సర్దుకొని ఇంటినుండి వెళ్తుంటే నందు, మధు ఆపుతారు. దాంతో మధుని ఇష్టమొచ్చినట్టు ఆదర్శ్ తిడతాడు. అది విన్న మధు వాళ్ళ అమ్మ సుమలత వచ్చి.. మీ అందరి గురించి ఆలోచించాడు కాబట్టే నా కొడుకు నిన్ను బయటకు వెళ్ళనీయకయండా ఆపుతున్నాడు.. అంతేగానీ నువ్వు పోసే గ్లాస్ మందు కోసం కాదని సుమలత అనగానే.. అయినా నిన్ను, వీడినే చూసి నేర్చుకోవాలని ఆదర్శ్ కోపంగా అనేసి వెళ్తుంటాడు. అప్పుడే వచ్చిన భవాని.. ఆదర్శ్ చెంపచెల్లుమనిపిస్తుంది. తనని చూసి అందరు షాక్ అవుతారు. ఇదేనా నువ్వు నా దగ్గర నేర్చుకున్న సంస్కారం.. సమయం వచ్చినప్పుడే నీకు అన్ని నిజాలు తెలుస్తాయని ఆదర్శ్ తో చెప్పి ఇంటిలోపలికి పంపిస్తుంది భవాని. ఆ తర్వాత మురారిని మధు, కృష్ణ హాల్లోకి తీసుకురాగానే అతని దగ్గరికి వెళ్ళి భవాని మాట్లాడుతుంది. ఇక మురారీని కూర్చోబెట్టి భవాని మాట్లాడుతుండుంది. కృష్ణ ఎమోషనల్గా.. అత్తయ్యా.. మీరా(ముకుంద) అనే అమ్మాయి వల్లే మనం మళ్లీ ఏసీపీ సర్ని ఇలా చూడగలుగుతున్నాం. తనే మన ఏసీపీ సర్ ప్రాణాలు కాపాడిందని భవానితో కృష్ణ అంటుంది. ‘అవునా.. ఆ అమ్మాయి ఎవరు? ఫోన్ నంబర్ అడ్రస్ ఉన్నాయా?’ అంటూ భవాని ఆరా తీస్తుంది. ఉన్నాయి అంటుంది కృష్ణ. ‘అయితే నేను వెళ్లి తనతో మాట్లాడతాను.. తనకు కృతజ్ఞతలు చెబుతానని భవాని అంటుంది. కాసేపటికి తన వివరాలని భవానికి పంపిస్తుంది కృష్ణ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |